ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 20న మంగళవారం పర్యటించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా తొలుత పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా …

ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 20న మంగళవారం పర్యటించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

పర్యటనలో భాగంగా తొలుత పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారన్నారు.

అనంతరం ఉదయం 11.30 గంటలకు ములకలపల్లి మండలం మంగపేట గ్రామంలో పబ్లిక్ హెల్త్ సెంటర్ ను, అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, వినాయకపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు.

మధ్యాహ్నం మూడు గంటల నుంచి అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాలపై జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు.

Updated On 18 Aug 2024 7:22 PM IST
cknews1122

cknews1122

Next Story