ప్రముఖ గాన కోకిల పి.సుశీలకు అస్వస్థత హైదరాబాద్:ఆగస్టు 18ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థతకు గురయ్యారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.సుశీల శనివారం సాయంత్రం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా పి.సుశీల గత కొంత కాలంగా వృద్ధప్య సమస్యలతో బాధపడుతున్నారు. 86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. పి.సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. సంగీత …

ప్రముఖ గాన కోకిల పి.సుశీలకు అస్వస్థత

హైదరాబాద్:ఆగస్టు 18
ప్రముఖ నేపథ్య గాయని అస్వస్థతకు గురయ్యారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.సుశీల శనివారం సాయంత్రం అనారోగ్యానికి గురయ్యారు.

దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా పి.సుశీల గత కొంత కాలంగా వృద్ధప్య సమస్యలతో బాధపడుతున్నారు. 86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది.

పి.సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె.

ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.

Updated On 18 Aug 2024 11:50 AM IST
cknews1122

cknews1122

Next Story