భార్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య… అతనో రాజకీయ నాయకుడు. పెళ్లై భార్య సైతం ఉంది. కొన్నాళ్లపాటు సంసారం సజావుగానే చేశాడు. అనంతరం అతగాడు మనసు వేరే మనిషివైపు మళ్లింది. అసలే పొలిటీషియన్. ఆ మహిళకు పెళ్లై భర్త కూడా ఉన్నాడు. దీంతో ఫస్ట్ ఆమె భర్త నుంచి ప్రియురాలిని దూరం చేశాడు. భర్తపై భార్యతోనే తప్పుడు కేసులు పెట్టించి చివరకు ఇద్దరినీ వేరు చేసేశాడు. ఆ తర్వాత చడీచప్పుడు లేకుండా ప్రియురాలి కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు. …

భార్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య…

అతనో రాజకీయ నాయకుడు. పెళ్లై భార్య సైతం ఉంది. కొన్నాళ్లపాటు సంసారం సజావుగానే చేశాడు. అనంతరం అతగాడు మనసు వేరే మనిషివైపు మళ్లింది. అసలే పొలిటీషియన్. ఆ మహిళకు పెళ్లై భర్త కూడా ఉన్నాడు. దీంతో ఫస్ట్ ఆమె భర్త నుంచి ప్రియురాలిని దూరం చేశాడు.

భర్తపై భార్యతోనే తప్పుడు కేసులు పెట్టించి చివరకు ఇద్దరినీ వేరు చేసేశాడు. ఆ తర్వాత చడీచప్పుడు లేకుండా ప్రియురాలి కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు. ప్రియురాలితో కలిసి ఏడాది కాలంగా ఉంటున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న భార్య అక్కడకు చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. చెప్పుతో ప్రియురాలికి..భర్తకు బడితపూజ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియురాలి మోజులో బీఆర్ఎస్ నేత
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముచ్చర్లకు చెందిన బీఆర్ఎస్ నేత గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డికు గతంలో పెళ్లి అయ్యింది. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య కూడా ఉంది.

భార్య ఉండగా అతడి దృష్టి పరాయి మహిళపై పడింది. ఆ మహిళతో ఏడాది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయమై దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే భర్త ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి.

శ్రీకాంత్ రెడ్డి ప్రియురాలి కోసం కరీంనగర్ జిల్లాలోని ముచ్చర్ల నుంచి హైదరాబాద్‌లోని అల్వాల్‌కు వచ్చేశాడు. ఏడాది కాలంగా దంపతులు మాదిరిగా సంసారం చేస్తున్నారు. భర్త ఆచూకీ కోసం భార్య ప్రయత్నిస్తూనే ఉంది.

అల్వాల్‌లో భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
ఇంతలో భర్త గడ్డమీది శ్రీకాంత్ర్ రెడ్డి హైదరాబాద్‌లోని అల్వాల్‌లోవేరే మహిళతో కలిసి ఉంటున్నాడన్న విషయం తెలుసుకుంది.

అంతే తనకుటుంబ సభ్యులతో కలిసి అల్వాల్ చేరుకుంది. భర్త, అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రియురాలి చెంప ఛెళ్లుమనిపించింది. చెప్పు తీసుకుని ఇద్దరినీ చితక్కొట్టింది. తన పరిస్థితి ఏంటని నిలదీసింది.

తనకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని నిలదీసింది. తన సంసారంలో ఎందుకు చిచ్చు పెట్టావంటూ అతడి ప్రియురాలిని ప్రశ్నిస్తూ చెప్పుతో కొట్టింది. చివరకు ప్రియురాలితోపాటు భర్తను గంభీరావుపేట్‌కు తీసుకెళ్లి దేహశుద్ది చేసింది.

వివాహితకు భర్తను దూరం చేసిన శ్రీకాంత్ రెడ్డి
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నాయకుడు గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి తన ప్రియురాలి కాపురంలో సైతం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టారని సమాచారం.

ఇద్దరి మధ్య వివాదాలు సృష్టించారని తెలిపారు. వివాహితకు భర్తను దూరం చేసి.. అతనిపై అక్రమ కేసులు బనాయించినట్లు తెలుస్తోంది. అటు భర్త దూరం అవ్వడంతో ఇక చేసేది లేక ఆమె గడ్డమీది శ్రీకాంత్ రెడ్డితోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. గడ్డమీది శ్రీకాంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated On 18 Aug 2024 2:14 PM IST
cknews1122

cknews1122

Next Story