మరో వైద్యురాలిపై దాడి… నిందితులు పరార్ దేశంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని సియోన్‌ ఆస్పత్రిలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఓ వైద్యురాలిపై రోగి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో ఆ వైద్యురాలు గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వైద్యురాలి వాగ్మూలం ఆధారంగా బీఎంసీ ఎంఏఆర్‌డీ అసోసియేషన్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు …

మరో వైద్యురాలిపై దాడి… నిందితులు పరార్

దేశంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని సియోన్‌ ఆస్పత్రిలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఓ వైద్యురాలిపై రోగి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో ఆ వైద్యురాలు గాయపడ్డారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వైద్యురాలి వాగ్మూలం ఆధారంగా బీఎంసీ ఎంఏఆర్‌డీ అసోసియేషన్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్యురాలిపై దాడి చేసిన వారంతా మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఆమెపై దాడికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

కాగా కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత, దేశవ్యాప్తంగా వైద్యులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు.

తాజాగా సియోన్‌ ఆస్పత్రిలో జరిగిన ఘటనతో వైద్యుల భద్రతపై మరోసారి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని వైద్య రంగం వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated On 18 Aug 2024 6:40 PM IST
cknews1122

cknews1122

Next Story