శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి అక్రమ రవాణా, అసాంఘిక శక్తులను అణచి వేయండి పోలీస్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే అమర్ పలమనేరు నియోజకవర్గం, ఆగస్టు 19, సీకే న్యూస్ పలమనేరు నియోజకవర్గం లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో, నియోజకవర్గంలోని, పలమనేరు అర్బన్ మరియు రూరల్, వి. కోట, గంగవరం మండలాలకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఆదివారంఆయన సమావేశం అయ్యారు. …

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి

అక్రమ రవాణా, అసాంఘిక శక్తులను అణచి వేయండి

పోలీస్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే అమర్

పలమనేరు నియోజకవర్గం, ఆగస్టు 19, సీకే న్యూస్

పలమనేరు నియోజకవర్గం లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు.

పలమనేరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో, నియోజకవర్గంలోని, పలమనేరు అర్బన్ మరియు రూరల్, వి. కోట, గంగవరం మండలాలకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఆదివారంఆయన సమావేశం అయ్యారు.

పలమనేరు ప్రాంతం కర్ణాటక, తమిళనాడు సరిహద్దు కావడంతో, అక్రమ రవాణా కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున, దాన్ని కట్టడి చేయాలని ఆయన తెలియజేసారు.

ప్రశాంతతకు మారుపేరైన పలమనేరులో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా ఉపేక్షించవద్దని, అందుకు తమ వైపు నుంచి పోలీస్ శాఖకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.

ఇక అసాంఘిక శక్తులను అణిచి వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా గంజాయి రవాణా పూర్తి స్థాయిలో కట్టడి కావాలన్నారు. అదేవిధంగా పలమనేరు పట్టణం, వి.కోటలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో సీఐ లు మురళీ మోహన్,నరసింహ రాజు, ప్రసాద్, సోమశేఖర్ రెడ్డి లు ఉన్నారు.

Updated On 18 Aug 2024 3:36 PM IST
cknews1122

cknews1122

Next Story