తెలుగు లోగిళ్ళలో రాఖి సందడి
రక్త సంబంధానికి ప్రతీకగా అన్నదమ్ముళ్లకి రాఖీ కట్టిన అక్క చెల్లెమ్మలు
సీకే న్యూస్ వేములపల్లి ఆగస్టు 19
ఒక తల్లి కడుపున పుట్టినటువంటి అక్క తమ్ముళ్లకి,అన్నా చెల్లెమ్మలకి వారు చిన్ననాటినుండి సరదాగా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ వారి బంధాన్ని గుర్తు చేసేదే రక్షాబంధన్.
ఈ రక్షాబంధన్ అనేది తెలుగింటి ఆడపడుచులే కాకుండా దేశంలోని ప్రతి ఒక్క మహిళ తన రక్త సంబంధానికి ప్రతీకగా తమ అన్నదమ్ములకి రాఖీ కట్టి పుట్టింటి నుండి తమకంటూ ఒక ధైర్యం ఉందని చెప్పుకోవడానికి ఈ రాఖీ పౌర్ణమి నిలుస్తుంది.
వేములపల్లి మండల వ్యాప్తంగా సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగ తెలుగు లోగిళ్ళలో తమ ఆడపడుచులు వారి ఇంట్లోని అన్నదమ్ములకు ఉదయాన్నే వారికీ బొట్టు పెట్టి రాఖి కట్టి స్వీట్ తినిపించి తమ తోడబుట్టినటువంటి అన్నదమ్ములను ఆదేవుడు కలకాలం చల్లగా ఉండాలని రాఖీ కట్టి ఆశీర్వదించడం జరిగింది,
అలాగే తమకు రాఖీ కట్టినటువంటి అక్కా చెల్లెమ్మలకు వారి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకొని తమ ఆడపడుచులకు మేము అండగా ఉన్నామని ఒక ధైర్యాన్ని నింపడం జరిగింది,
కలకాలం ఈ రాఖీ పౌర్ణమి తోడబుట్టినటువంటి అన్నా చెల్లెళ్లకు అక్క తమ్ముళ్లకు తమ బంధాలను గుర్తు చేస్తుందని.అలాగే దేశంలో జరుగుతున్నటువంటి అమ్మాయిలపై అఘాయిత్యాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చి ఆడపిల్లల రక్షణ కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు