ఎం ఏ ఆర్ పి సంస్థ చే పలమనేరువాసులకు జ్ఞాపికలు
ఎం ఏ ఆర్ పి సంస్థ చే పలమనేరువాసులకు జ్ఞాపికలు పలమనేరు,ఆగస్టు19 సీకే న్యూస్. జానపద గీతాలు, కళలు, సేవలు కోలాటాలు ,నృత్యాలు ప్రాచీన కళలకు భారతదేశం పెట్టింది పేరు. అటువంటి ప్రాచీన కళలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి అవసరాన్ని గుర్తించి, అటువంటి వారిని, ప్రోత్సహించే నిమిత్తమై, ఎం ఏ ఆర్ పి సంస్థ, మాస్ అసోసియేషన్ ఫర్ రూరల్ పూర్, తిరుపతి విశ్వం హై స్కూల్, జీవకోన నందు, నిన్న జరిగిన అవార్డుల …
ఎం ఏ ఆర్ పి సంస్థ చే పలమనేరువాసులకు జ్ఞాపికలు
పలమనేరు,
ఆగస్టు19 సీకే న్యూస్.
జానపద గీతాలు, కళలు, సేవలు కోలాటాలు ,నృత్యాలు ప్రాచీన కళలకు భారతదేశం పెట్టింది పేరు. అటువంటి ప్రాచీన కళలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అటువంటి అవసరాన్ని గుర్తించి, అటువంటి వారిని, ప్రోత్సహించే నిమిత్తమై, ఎం ఏ ఆర్ పి సంస్థ, మాస్ అసోసియేషన్ ఫర్ రూరల్ పూర్, తిరుపతి విశ్వం హై స్కూల్, జీవకోన నందు, నిన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో, పలమనేరుకు చెందిన,
సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్రావు, సామాజిక సేవ విభాగంలో మరియు దేశభక్తి గేయాల విభాగంలో ఎస్ సుకన్య, ఈ సంస్థ ద్వారా అవార్డులు మరియు సన్మానం ఆ సంస్థ అధ్యక్షుడు గుర్రప్ప నాయుడు చేతుల మీదుగా చేయడం జరిగింది.
సేవా రంగంలో మరియు కళా రంగంలో పలమనేరు వాసులు ఇద్దరికీ అవార్డు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.