KamareddyPoliticalTelangana

వివాహితను లైంగిక వేధిస్తున్న వ్యక్తి కి పబ్లిక్‌గా దేహశుద్ధి చేసిన భర్త

వివాహితను లైంగిక వేధిస్తున్న వ్యక్తి కి పబ్లిక్‌గా దేహశుద్ధి చేసిన భర్త

వివాహితను లైంగిక వేధిస్తున్న వ్యక్తి కి పబ్లిక్‌గా దేహశుద్ధి చేసిన భర్త

వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కాంగ్రెస్ నేతకు పబ్లిక్‌గా దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే దేవేందర్ రెడ్డి, గత నెల రోజులుగా ఒక వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడు.

నిందితుడి టార్చర్ను భరించలేకపోయిన బాధితురాలు, చివరకు ధైర్యం చేసి తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది.

రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త.. నిందితుడిని పట్టుకోవాలని భావించిన బాధితురాలి భర్త, బాన్సువాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తన భార్యను వేధిస్తుండగా దేవేందర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు.

పట్టపగలే ఆసుపత్రి ప్రాంగణంలో రాజకీయ నాయకుడ్ని పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో నిందితుడిని ఆసుపత్రి నుండి నడిరోడ్డుపైకి లాక్కొచ్చాడు. అంతా చూస్తుండగానే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు.

అనంతరం నిందితుడు దేవేందర్ రెడ్డిని బాధితురాలి భర్త, అతడి సన్నిహితులు రోడ్డుపై కొడుతూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

ఈ క్రమంలో పట్టణ ప్రధాన రహదారిపై ప్రజలందరూ చూస్తుండగానే నిందితుడికి దేహశుద్ధి చేయడంతో ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ సమస్య బాన్సువాడ పోలీస్ స్టేషన్కు చేరింది.

అయితే, నిందితుడు అధికార పార్టీ నాయకుడికి ముఖ్య అనుచరుడు అని చెప్పడంతో ఈ విషయాన్ని ఇక్కడితోనే సర్దుబాటు చేయడానికి రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది.

కేసు నమోదు కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులు బాధితురాలిని, ఆమె భర్తను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికంగా మాట్లాడుుంటున్నారు. ఈ విషయంలో బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అని బాన్సువాడతో పాటు కామారెడ్డి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button