PoliticalTelangana

తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క!!

తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క!!

పండగ పూట విషాదం… తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క!!

రక్త సంబంధాలను, అనుబంధాలను పంచుకునే పండగా రక్షా బంధన్ ను జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధానికి ప్రతీకగా ఈ వేడుకను నిర్వహిస్తారు.అలా అందరూ ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది.

ఏటా మాదిరిగానే ఈ సారి కూడా తోబుట్టువులు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి పండగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అక్క తన సోదరుడికి రాఖీ కట్టి.. చనిపోయింది.

గుండెల్ని పిండేసే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ తండాలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ తండాకు చెందిన ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు.

ఇక ఆ యువతి కోదాడలోని ఓ ప్రైవేటు పాల్ టెక్నిక్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. అయితే గత కొంతకాలంగా ఆ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ ఆకతాయి వేధింపులను చాలా కాలం భరించిన ఆ యువతి..చివరకు విసుకు చెందింది. ఆకతాయి వేధింపులను ఆ బాలిక తట్టులోకపోయింది. చావే పరిష్కార మార్గంగా భావించి..దారుణ నిర్ణయం తీసుకుంది.

రెండ్రోజుల క్రితం ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన ఆ బాలికను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలోనే రెండ్రోజులుగా బాలిక అక్కడే చికిత్స పొందుతుంది. తాను చనిపోతానని ముందే తెలిసిన ఆ బాలిక తన తమ్ముడికి రాఖీ కట్టాలని భావించింది. దీంతో ఆ బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఆమె సోదురుడు సోమవారం ఉదయం వెళ్లాడు.

సోమవారం తన తమ్ముడికి ఆ యువతి రాఖీ కట్టింది. తమ్ముడి నుదిటిపై బొట్టుపెట్టి తన ప్రేమను చాటుకుంది. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని సోదరుడి వద్ద మాట తీసుకుంది. అనంతరం కాసేపటికే ఆ బాలిక మరణించింది. ఇలా తాను చనిపోతానని తెలిసి సోదరుడికి చివరిసారిగా రాఖీ కట్టడం అందరినీ కలచి వేసింది.

బాలిక మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. పండగపూట ఇలా జరగడంతో స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button