కృష్ణాపురంలో కార్డెన్ సెర్చ్
అసాంఘిక శక్తులకు ఎవరు సహకరించవద్దు
యువత గంజాయికి బానిస కావొద్దు : ఏఎస్పి శివ ఉపాధ్యాయ
సి కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కృష్టపురం గ్రామంలో ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పి శివ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏఎస్పీ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఎటువంటి సమస్య అయినా పోలీసులకు తెలియజేయాలని, అపరిచి అనుమానిత అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని తెలిపారు.
యువత గంజాయి మత్తు పదార్థాలు లాంటి వాడికి దూరంగా ఉండాలని దానికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిషేధిత గుడుంబాను ఎవరు అమ్మకూడదు మరియు తయారు చేయకూడదని అలా చేసినట్టు ఎవరికైనా తెలిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు.
అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ సమస్య ఎటువంటిదైనా పోలీసులకు తెలియజేయాలని కచ్చితంగా మీ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తామని వారికి హామీని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నూగురు వెంకటాపురం సిఐ బండారి కుమార్, వాజేడు సిఆర్పిఎఫ్ బెటాలియన్ సి/ కమాండర్ సతీష్, పేరూరు ఎస్సై జి కృష్ణ ప్రసాద్, ఎస్సైహరీష్, సివిల్ మరియు టి జి ఎస్ పి సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.