మహిళా కానిస్టేబుల్ తో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య… Social media : ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుందామని ప్రమోజల్‌ పెట్టాడు.. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన ఆమె.. ప్రియుడినే పెళ్లి చేసుకుంది.. కొంత కాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మరో మహిళతో ఉండసాగాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. మహిళా కానిస్టేబుల్‌తో విడిగా కాపురం పెట్టాడు.. ఇది పసిగట్టిన భార్య.. ఆ ఇంటి ముందు తిష్టవేసి.. …

మహిళా కానిస్టేబుల్ తో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…

Social media : ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుందామని ప్రమోజల్‌ పెట్టాడు.. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన ఆమె.. ప్రియుడినే పెళ్లి చేసుకుంది..

కొంత కాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మరో మహిళతో ఉండసాగాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. మహిళా కానిస్టేబుల్‌తో విడిగా కాపురం పెట్టాడు..

ఇది పసిగట్టిన భార్య.. ఆ ఇంటి ముందు తిష్టవేసి.. భర్త బండారాన్ని బయటపెట్టింది.. రెడ్‌ హ్యాండెడ్‌గా పెట్టుకుని.. పోలీసులకు అప్పగించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

మహిళా కానిస్టేబుల్‌ ఇంట్లో ఉన్న తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఓ మహిళ.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.. తన కాపురంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్ బండారాన్ని బట్టబయలు చేసింది ఓ భార్య..

విజయనగరంలో సదరు మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందే నిరసనకు కూర్చుంది ఆ మహిళ. నాతో కాపురం కాదని ఆ మహిళా కానిస్టేబుల్ తో తన భర్త సతీష్ సహజీవనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది..

తన భర్త సతీష్ ఆ కానిస్టేబుల్ తో ఇంట్లో ఉండగానే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రెండేళ్లుగా నన్ను విడిచి.. ఆ కానిస్టేబుల్ ఇంటిలోనే సతీష్ మకాం వేశాడని ఆరోపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నాని మధనపడుతుంది.

ఇంట్లో ఉన్న తన భర్త సతీష్ ను బయటకు పంపమని.. ఆ కానిస్టేబుల్ ఇంటి తలుపు కొట్టినా.. తీయడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చెసి సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక, పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గుట్టుకాస్తా బయటబయలు అయ్యింది..

Updated On 20 Aug 2024 11:56 PM IST
cknews1122

cknews1122

Next Story