PoliticalsuryapetaTelangana

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ

గంజాయి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ చరమందరాజు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఆగస్టు 21

జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు మఠంపల్లి మండల కేంద్రంలోని మోడల్ కాలేజీ అండ్ హై స్కూల్ లో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, విద్యార్థిని విద్యార్థులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో సిఐ చరమంద రాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని.

ప్రతి గ్రామంలో, స్కూల్లో కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలనీ సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు అని బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు ఓటిపి ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు.

మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు.

వ్యక్తిగత ఫోటోలను డిపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.
యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మోడల్ కాలేజీ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్ రమేశ్ కుమార్,ఉపాధ్యాయులు జాకీర్, సైదైయ్య, లక్ష్మాణ్, నాగరాజు మరియు ఉపాధ్యాయుని వాణి, భారతి మేడమ్ అండ్ ఏఎస్ఐ .బి ఆనంద్ నాయక్, కానిస్టేబుల్ వి. విజయ్ కుమార్ , హోం గార్డు వెంకన్న మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!