హైదరాబాద్ నగర శివారు మణికొండలోని వాటర్ బోర్డు కార్యాలయంలో లంచం బాగోతం బయటపడింది. మణికొండ వాటర్ బోర్డు కార్యాలయంలో మేనేజర్గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డి రూ.30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఆమెకు సహకరించిన నరేష్ గౌడ్ను ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు.
మణికొండ మునిసిపాలిటీ నిక్నాపూర్లో రెండు కొత్త కనెక్షన్ల కోసం వాటర్ బోర్డు అధికారులు రూ.50 వేలు అమౌంట్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
పక్కా ప్లాన్ ప్రకారం.. వాటర్ బోర్డ్ కార్యాలయంలో అవినీతి అధికారులు రూ.30000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల.. ప్రభుత్వ కొలువుల్లో ఉన్న మహిళలు లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల తహసీల్దార్ మాధవి ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ధరణి ఆపరేటర్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండడ్గా పట్టుకున్నారు. కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ మీసేవాలో విరాసత్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
గోపాల్ నుంచి ఎమ్మార్వో మాధవీ 30 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఎమ్మార్వోతో పాటు ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు.. ఎమ్మార్వో మాధవి రూ. 5వేలు, ధరణి ఆపరేటర్ వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్ఏసీబీకి చిక్కారు. రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.