కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై పలమనేర్ బార్ అసోసియేషన్ నిరసన
కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై పలమనేర్ బార్ అసోసియేషన్ నిరసన పలమనేరు నియోజకవర్గం ఆగస్టు 21 సి కె న్యూస్ . కోల్కత్తా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై, పలమనేర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, పలమనేరు ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బందికి, సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పలమనేర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె లక్ష్మీపతి మాట్లాడుతూ…. కోల్కత్తా వైద్య విద్యార్థి ఘటన అత్యంత దారుణమని, నిందితులకు కఠిన …
![కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై పలమనేర్ బార్ అసోసియేషన్ నిరసన కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై పలమనేర్ బార్ అసోసియేషన్ నిరసన](https://cknewstv.in/wp-content/uploads/2024/08/IMG-20240821-WA0012.jpg)
కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై పలమనేర్ బార్ అసోసియేషన్ నిరసన
పలమనేరు నియోజకవర్గం ఆగస్టు 21 సి కె న్యూస్
. కోల్కత్తా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై, పలమనేర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, పలమనేరు ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బందికి, సంఘీభావం తెలియజేయడం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమంలో పలమనేర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె లక్ష్మీపతి మాట్లాడుతూ…. కోల్కత్తా వైద్య విద్యార్థి ఘటన అత్యంత దారుణమని, నిందితులకు కఠిన శిక్ష పడాలని, అదే సమయంలో వైద్యులకు, తగు రక్షణ కల్పించాలని, వైద్య విద్యార్థి హత్య కేసు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని, హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత వరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకపోవడం ఏంటని, ఈ విషయంపై సుప్రీంకోర్టు వారు సుమోటోగా కేసు విచారణకు తీసుకున్నారు అని, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక కానిస్టేబుల్ ను నియమించాలని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
వైస్ ప్రెసిడెంట్ పి పరమశివప్ప మాట్లాడుతూ… అత్యాచార ఘటన అత్యంత పాశవికమని,ఎన్ని కోట్లు ఉన్నా, ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదని,అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టర్లు దేవుళ్ళతో సమానమని, అటువంటి పరమ పవిత్రమైన వైద్య వృత్తిలోఉన్న వైద్యురాలను, అత్యంత కిరాతనంగా చంపడం దారుణమని, మీడియాఇటువంటి విషయాలను హైలెట్ చేయాలని, మీడియా బాధ్యత ఎంతో ఉందని, ప్రతిచిన్న విషయం మీడియా ద్వారానే,ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
లాయర్ ఎల్ భాస్కర్ మాట్లాడుతూ…. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా, కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని, ఒక వైద్య విభాగమే కాక, అన్ని రకాల సంఘాలు ఈ విషయంపై తమ నిరసనను తెలియజేశారని,
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక సాధారణకార్యకర్తలా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం ఏంటని, ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఎన్ని పనులుఉన్నా పక్కన పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు.
లాయర్ బర్కత్ మాట్లాడుతూ…. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గౌరవ స్థానం కలిగి ఉందని, ఇంత పవిత్ర పుణ్య దేశంలో ఇటువంటి ఘోరమైనటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని,
ఆడపిల్లలను ఇక చదువులకు పంపాలంటే భద్రత ఏముందని, నిందితునికి కఠిన శిక్ష పడే విధంగా, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చట్టాలు, కఠిన శిక్షలు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆసుపత్రి సూపరిండెంట్ మమతారాణి మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా అత్యాచార హత్యకు గురికాబడిన వైద్య విద్యార్థి అయిన మౌమిత దేబ్నాథ్ కు సంఘీభావంగా అన్ని వర్గాల ప్రజలు బాసటగానిలవడం వైద్య వృత్తికి గౌరవం ఇచ్చినట్టని, ప్రతి ఏరియా హాస్పిటల్ లో ఒక పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు
ఈ కార్యక్రమంలో లాయర్లు కే లక్ష్మీపతి, భాస్కర్, బర్కత్, లోకేష్, బార్ అసోసియేషన్ సంబంధించిన మిగతా లాయర్లు …..డాక్టర్లు మమతారాణి, యుగంధర్ తక్కిన డాక్టర్లు పాల్గొన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)