కేటీఆర్ కు నిరసన సెగ…
హైదరాబాద్ మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ ముందు మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళన చేపట్టారు. మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.
కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న నిరసనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా నేతలు ఆందోనళకి దిగారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరయ్యారు. ఇటీవల మహిళల పట్ల వ్యాఖ్యలు చేయగా.. ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు కేటీఆర్. ఇదే క్రమంలో కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వగా.. ఈరోజు విచారణకు హాజరయ్యారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు..
బస్సుల్లో మహిళలు ఎల్లిపాయల పొట్టు తీసుకుంటే తప్పేం ఉందని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. ఇప్పుడు ఆ సెటైర్లే కేటీఆర్ ను యావత్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పేలా చేసింది. అసలు కేటీఆర్ ఏం అన్నారు?…
కేటీఆర్ మాట్లాడుతూ .. ” బస్సులో అల్లం ఎల్లిపాయ పొట్టు తీస్తే తప్పేం లేదు అక్క.. కానీ దానికోసమే బస్సు పెట్టిర్రు అని తెలియక ఇన్ని రోజులు మేం మాములుగా నడిపినం.. మాకు తెలవకపాయె పాపం… మీరు అప్పుడే చెప్తే బాగుండు.. ఎక్కువ పెట్టు బస్సులు.. బస్సులు ఎక్కువ సంఖ్యలో లేక తన్నుకుంటుర్రు.. మంచిగా లేదు..
పెట్టు మనిషికి ఒక బస్సు పెట్టు మేమెందుకు వద్దు అంటాము. కుటుంబం కుటుంబం మంచిగా కుట్లు, అల్లికలు.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.