*మూడు లక్షల విలువ చేసే పది టన్నుల రేషన్ బియ్యం పట్టివేత డ్రైవర్ క్లీనర్ అరెస్ట్ పలమనేర్, ఆగస్టు 25, సి కె న్యూస్. చిత్తూరు జిల్లాపలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం నాగమంగళం వద్దఆదివారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కాపు కాసి ఈచర్ వాహనంలో తరలిస్తున్న సుమారు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకుని పలమనేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పూతలపట్టు నియోజకవర్గం అరగొండ నుండి కర్ణాటక రాష్ట్రం బంగారు పేటకు తరలిస్తున్నట్లు …

*మూడు లక్షల విలువ చేసే పది టన్నుల రేషన్ బియ్యం పట్టివేత డ్రైవర్ క్లీనర్ అరెస్ట్

పలమనేర్, ఆగస్టు 25, సి కె న్యూస్.

చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం నాగమంగళం వద్ద
ఆదివారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కాపు కాసి ఈచర్ వాహనంలో తరలిస్తున్న సుమారు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకుని పలమనేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పూతలపట్టు నియోజకవర్గం అరగొండ నుండి కర్ణాటక రాష్ట్రం బంగారు పేటకు తరలిస్తున్నట్లు సమాచారం.
సుమారు 3 లక్షల రూపాయలు విలువచేసే పది టన్నుల రేషన్ బియ్యంతో పాటు ఈచర్ వాహనాన్ని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ మరియు క్లీనర్లను అదుపులోకి తీసుకొని దీని వెనక ఎవరున్నారని విచారిస్తున్నామన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Updated On 25 Aug 2024 1:43 PM IST
cknews1122

cknews1122

Next Story