ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటనలో అపశృతి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు.
అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసు కుంది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు.
భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అయితే భద్రత నేపథ్యంలో వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తిని పాము కాటు వేసింది.
దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన కానిస్టేబుల్ ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…