ఎమ్మెల్సీ కవితకు బెయిల్... ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది.మార్చి 15 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు గంటన్నర పాటు కవిత లాయర్ ముకుల్ రోహత్గ, ఈడీ తరఫున ఎస్వీ రాజు మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.కవిత బెయిలు అర్హురాలన్న రోహత్గా వాదనలతో ధర్మాసనం ఏకీభవించి బెయిల్ ఇచ్చింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున …

ఎమ్మెల్సీ కవితకు బెయిల్...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది.మార్చి 15 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు గంటన్నర పాటు కవిత లాయర్ ముకుల్ రోహత్గ, ఈడీ తరఫున ఎస్వీ రాజు మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.కవిత బెయిలు అర్హురాలన్న రోహత్గా వాదనలతో ధర్మాసనం ఏకీభవించి బెయిల్ ఇచ్చింది.

కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా.. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు.ఇప్పటికే కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని రోహత్గీ తెలిపారు.

ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు.

కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు. కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు.దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు.

ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్‌ గ్రూప్‌ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. 493 మంది సాక్షులను విచారించారని అన్నారు.

సాక్షులను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు.

దీనిపై ఈడీ న్యాయవాదిఎస్వీ రాజు తన వాదనను వినిపిస్తూ, కవిత దర్యాప్తుకు సహకరించడం లేదన్నారు.అయితే నేరం జరిగింది అనడానికి ఆధారం ఏముందని ను అడిగింది ధర్మాసనం .

కవితను రెండేళ్లుగా వాడిన మొబైల్ ఫోన్ల ను అడిగామని,
కవిత వాటిని ఇచ్చారని తెలిపారు .అయితే మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేసారా..డేటా డిలీట్ చేసారా అని అడిగామని, అందుకు కవిత తనకు తెలీదు అన్న సమాధానాలు ఇచ్చారన్నారు న్యాయవాది. ఈడీ కవితను అడిగిన ప్రశ్నలు..కవిత ఇచ్చిన సమాధానాలను కోర్టుకు తెలిపిన ఎస్వీ రాజు

కవిత సమాజ సేవలో ఉన్నారని, విద్యార్హతలు..సమాజంలో వారి కుటుంబానికి గుర్తింపు ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యాలకు అడ్డుపడిన న్యాయవాది వ్యక్తి గత హోదా ను బెట్టి బెయిల్ మంజూరు చేయడం కుదరదన్నారు..

కైమ్ డేటా రికార్డులో నిందితులతో జరిపిన చాటింగ్స్ ఉన్నాయని ప్రస్తావించారు . బుచ్చిబాబు ,అభిషేక్ బోయినపల్లితో జరిపిన చాట్స్ గురించి తనకు తెలియదని కవిత చెప్పారన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి,శరత్ చంద్రా రెడ్డి నుంచి నిధులను సమకూర్చి కవిత ఆప్ కి అందజేశారని వాదించారు.

ఢిల్లీలో కేజ్రీవాల్ ను కలిసిన తరువాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెళ్లి కవితను కలిశారన్నారు.. కేసులో కవిత పాత్ర గురించి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కేజ్రీవాల్ తదితరులు చెప్పిన అంశాల గురించి వివరించారు. దీనిపై ముకుల్‌ రోహత్గీ కౌంటర్ ఇస్తూ, కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.

విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు. ఇప్పటికే విచారణ పూర్తి కావడంతో బెయిల్ ఇవ్వాల్సిందేనని ముకుల్ ధర్మాసనాన్ని కోరారు.. ఇరు వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసులలో షరతులతో కూడిన బెయల్ మంజూరు చేసింది.

Updated On 27 Aug 2024 1:39 PM IST
cknews1122

cknews1122

Next Story