దొంగలు హల్‌చల్‌.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్‌. సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు కూల్ డ్రింక్ షాప్ లు, ఓ కిరాణా షాప్ లో కొందరు దొంగతనాలకు పాల్పడ్డారు.నల్లబట్టలు ధరించి ఎవరికి అనుమానం రాకుండా దోడిచేశారు. అయితే కిరాణా షాప్ అలజడి రావడంతో కొందరు స్థానికులు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా షాపులో కొందరు …

దొంగలు హల్‌చల్‌.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్‌.

సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు కూల్ డ్రింక్ షాప్ లు, ఓ కిరాణా షాప్ లో కొందరు దొంగతనాలకు పాల్పడ్డారు.నల్లబట్టలు ధరించి ఎవరికి అనుమానం రాకుండా దోడిచేశారు.

అయితే కిరాణా షాప్ అలజడి రావడంతో కొందరు స్థానికులు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా షాపులో కొందరు ఉండటంతో కేకలు వేశారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరార్‌ అయ్యేందుకు ప్రయత్నించారు. పరుగులు పెడుతున్న దొంగలను స్థానికులు వెంబడించారు.

దీంతో దొంగలు వారు ధరించిన నల్లబట్టలను పరుగులు పెడుతూనే నడిరోడ్డుమీదే విప్పి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పారిపోయారు. దీంతో గ్రామస్తులకు దొంగలను పట్టుకునేందుకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దొంగలు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇక చేసేది ఏమీలేక గ్రామస్థులు వెనుతిరిగారు. అయితే ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే వున్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

దొంగలు నల్లబట్టలు ధరించి దోపిడీలకు పాల్పడుతున్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో రాత్రిళ్లు నల్లబట్టలు ధరించి దోపిడి చేయడం వలన ఎవరికి కనిపించకుండా ఉండవచ్చనే ఐడియాతో దొంగతనాలకు పాల్పడుతున్నారని.

ఒకవేళ ఎవరైనా వారిని కనిపెట్టిన చీకటిగా వున్న ప్రదేశంలో వుంటే వారిని ఎవరు గుర్తుపట్టరనే ఉద్దేశంతో ఇలా చేసి వుంటారని పోలీసులు తెలిపారు. దొంగలు విడిచి వెల్లిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని .. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated On 27 Aug 2024 3:10 PM IST
cknews1122

cknews1122

Next Story