నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేడు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ మళ్ళీ విచారణ బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావు నిన్న ఢిల్లీకి చేరుకొని కవిత తరఫు …

నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

నేడు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ మళ్ళీ విచారణ

బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ

లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

విచారణ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావు నిన్న ఢిల్లీకి చేరుకొని కవిత తరఫు అడ్వకేట్లతో సమావేశమయ్యారు.

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్క రించడంతో సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్ వేశారు.

గత విచారణలో కవిత బెయిల్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.హైకోర్టులో కేసుడైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యం అయిందని నిలదీసింది..

సుప్రీంకోర్టు. కవిత కేసులో తాజాగా ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడంతో ఇరుపక్షాల వాదనలను నేడు సుప్రీం కోర్టు విననుంది ధర్మాసనం..

Updated On 27 Aug 2024 11:05 AM IST
cknews1122

cknews1122

Next Story