వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య వరకట్నం వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ జిల్లాకు చెందిన బొడ్డుపల్లి శివ కోటయ్యతో నల్గొండ మండలానికి చెందిన అక్కేపల్లి వాసవితో 5 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఒక అబ్బాయి వైదేక్ సాయి (4)ఉన్నాడు. జీవనోపాధి కోసం ఉప్పల్ సత్యనగర్ లో నివాసం ఉంటున్నారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద …

వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

వరకట్నం వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ జిల్లాకు చెందిన బొడ్డుపల్లి శివ కోటయ్యతో నల్గొండ మండలానికి చెందిన అక్కేపల్లి వాసవితో 5 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది.

వీరికి ఒక అబ్బాయి వైదేక్ సాయి (4)ఉన్నాడు. జీవనోపాధి కోసం ఉప్పల్ సత్యనగర్ లో నివాసం ఉంటున్నారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద 14 తులాల బంగారం, రెండు లక్షల రూపాయలు, ఇంటి సామాన్లు పెట్టారు. అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా తరుచూ వేధించేవాడు.

వేధింపులు భరించలేక ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో వేరే రూమ్ లో తన భర్త ఉండగానే వాసవి ఫ్యాన్ కి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అది గమనించిన భర్త ఇంటి తలుపులు పగలకొట్టి భార్యను కిందకు దించాడు. కొన ఊపిరితో ఉండటంతో వాసవిని ఉప్పల్లో ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించింది.

అదనపు కట్నం కోసమే తన కూతుర్ని వేధించేవాడని అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి దామోదరచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.

Updated On 27 Aug 2024 10:31 PM IST
cknews1122

cknews1122

Next Story