ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు
కొద్ది రోజులుగా తీసుకున్న లోన్ చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తుండడంతో పాటు లోను చెల్లించకపోతే భార్య పిల్లల అంతు చూస్తానని బెదిరించడంతో తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ లో గురువారం చోటుచేసుకుంది.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం గూడ సతీష్ రెడ్డి(35) నగరంలోని కోతి రాంపూర్ లో నివాసం ఉంటున్నాడు. సతీష్ అసోసియేట్ కన్సల్టెన్సీ పేరిట కోర్టు చౌరస్తాలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అవసరం ఉన్నవారికి పలు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తుంటాడు.
లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న సతీష్ రెడ్డి కి కొద్ది రోజుల క్రితం నుంచి లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నారు.
దీంతో మనస్థాపానికి గురైన సతీష్ రెడ్డి తన ఆఫీసులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.