ఎంవిఆర్ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమం పలమనేరు నియోజకవర్గం ఆగస్టు 30 సీకే న్యూస్ ఎం వి ఆర్ డిగ్రీ కళాశాల యందు, వనమహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు డిఎఫ్ ఓ చైతన్య కుమార్ రెడ్డి ఐఎఫ్ఎస్స్, పలమనేరు రేంజ్ ఫారెస్ట్ అధికారులు మరియు కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫారెస్ట్ అధికారులు వేణుగోపాల్ ,సబ్ డి ఎఫ్ ఓ, శివన్న ఎఫ్ఆర్ఓ ,పలమనేరు కళాశాల …

ఎంవిఆర్ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమం

పలమనేరు నియోజకవర్గం ఆగస్టు 30 సీకే న్యూస్

ఎం వి ఆర్ డిగ్రీ కళాశాల యందు, వనమహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు డిఎఫ్ ఓ చైతన్య కుమార్ రెడ్డి ఐఎఫ్ఎస్స్, పలమనేరు రేంజ్ ఫారెస్ట్ అధికారులు మరియు కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఫారెస్ట్ అధికారులు వేణుగోపాల్ ,సబ్ డి ఎఫ్ ఓ, శివన్న ఎఫ్ఆర్ఓ ,పలమనేరు కళాశాల కరస్పాండెంట్ ఎం.వి.ఆర్, ప్రిన్సిపల్ లక్ష్మీ సుధా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అమర్నాథ్, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

విద్యార్థిని విద్యార్థులు చేత వనమహోత్సవ ప్రతిజ్ఞ చేయించి, కళాశాల ప్రాంగణంలో… ప్రతి విద్యార్థికి మొక్కలు పంపిణీ చేశారు.

వీటి సంరక్షణ బాధ్యతను తెలియజేసి, మానవ జీవితంలో ఆక్సిజన్ ఎంత ముఖ్యమో… చెట్లు పెంచడం వలన ఆక్సిజన్ తగినంత లభిస్తుందని, కాలుష్యాన్ని తగ్గించే వీలుందని ఈ సందర్భంగా పిల్లలకు అవగాహన కలిగించారు .

Updated On 30 Aug 2024 5:53 PM IST
cknews1122

cknews1122

Next Story