డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్‌ Web desc : వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటు తో పలువురు చనిపోతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దిల్లీలో ఓ యువ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.దిల్లీ రూప్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్‌.. స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్‌ …

డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్‌

Web desc : వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటు తో పలువురు చనిపోతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా దిల్లీలో ఓ యువ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
దిల్లీ రూప్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్‌.. స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు.

ఈ సందర్భంగా రవికుమార్‌ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.

దీంతో అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్‌ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదగా ఉన్న కానిస్టేబుల్‌ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్‌ 2010లో దిల్లీ పోలీస్‌ విభాగంలో చేరాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్‌ గుండె పనితీరును తెలిపే యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకోవడం గమనార్హం.

Updated On 30 Aug 2024 1:57 PM IST
cknews1122

cknews1122

Next Story