రంగారెడ్డి జిల్లాలో దారుణం.. యువకుడి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణం యువకుడి వేధింపులు తాళలేక యువతి బలన్మరణానికి పాల్పడిన విషాధ ఘటన రంగారెడ్డి జిల్లాల మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. దుర్గానగర్‌కు చెందిన మైనర్ బాలిక (17)ను మహేశ్వరం ప్రాంతానికి చెందిన యువకుడు కొన్నాళ్ల నుంచి వేధిస్తున్నాడు. తాజాగా వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక …

రంగారెడ్డి జిల్లాలో దారుణం..

యువకుడి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణం

యువకుడి వేధింపులు తాళలేక యువతి బలన్మరణానికి పాల్పడిన విషాధ ఘటన రంగారెడ్డి జిల్లాల మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. దుర్గానగర్‌కు చెందిన మైనర్ బాలిక (17)ను మహేశ్వరం ప్రాంతానికి చెందిన యువకుడు కొన్నాళ్ల నుంచి వేధిస్తున్నాడు.

తాజాగా వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated On 31 Aug 2024 2:04 PM IST
cknews1122

cknews1122

Next Story