ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం 32 ఎకరాల్లో..
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్డు కనెక్టివిటీ
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ : ఉస్మానియా నూతన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని దాదాపు 32 ఎకరాల్లో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
నగరం నడిబొడ్డున నిర్మించనున్న భవనాన్ని కార్పొరేట్‌కు దీటుగా చేపట్టి తెలంగాణకు రోల్ మోడల్‌గా ఉంచుతామన్నారు. గోషామహల్ పోలీస్ స్టేడియంను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన భవనాలు, పరిసర ప్రాంతాలు, రోడ్లు, నాలాను బైక్‌పై వెళ్లి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశామన్నారు.
ఆస్పత్రిని మరో వందేళ్లకు అవసరమయ్యే విధంగా నిర్మిస్తామన్నారు. గోషామహల్ పోలీస్ అకాడమీ అనుబంధ శాఖలను బహదూర్‌పురా పేట్లబురుజులోని పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ కేంద్రంలోకి మార్చుతామన్నారు.
హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు ఉండకుండా ఆస్పత్రికి చేరుకునేలా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీఓ జ్యోతి, ఏసీపీ ఉదయ్‌కృష్ణ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సయ్యద్ సైదుద్దీన్, సర్వేయర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
గంతల నాగరాజు రిపోర్టర్