డేంజర్ జోన్ లో తుమ్మల తండా…
సికె న్యూస్ కథనానికి స్పందించిన డిప్యూటీ తహశీల్దార్ కరుణ శ్రీ
తుమ్మల తండా నుండి గొరిల్లా పాడు తండాకు తరలింపు..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, గొరిల్లా పాడు తండా గ్రామ పంచాయతీ, తుమ్మల తండా గ్రామంలో నీట మునిగిన ఇండ్లు, పంట పొలాలు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తండా ప్రజలకు అవస్థను తెలుసుకున్న సికె న్యూస్ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం జరిగింది.
సి కె న్యూస్ కథనంతో అప్రమంతమైన మండల అధికారులు తుమ్మల తండా గ్రామానికి వరద నీరు పోటెత్తడంతో డిప్యూటీ తాసిల్దార్ కరుణ శ్రీ ఆధ్వర్యంలో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడం జరిగింది
వారితోపాటు మూగజీవాలను తరలించారు సమయానికి స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఏది ఏమైనను వరద నీరు తగ్గింతవరకు ప్రజల ప్రమాదం ఉండాలని డిప్యూటీ తాసిల్దార్ కరుణశ్రీ సూచించారు