
ప్రసవానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు అమ్ముకున్న భర్త.. పోలీసులకు ఆశ్రయించిన భార్య
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి శాంతినగర్‌లో నివసిస్తున్న నికితా, శ్రావణ్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. కాన్పు కోసం నికితా తన పుట్టింటికి వెళ్లగా, ఆమె ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రతి నెలా ఇంటి ఈఎంఐ చెల్లిస్తూ వచ్చింది.
పోలీసులు తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డి కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న నికితకు 2020 అక్టోబర్లో నల్లూరి శ్రావణ్‌తో వివాహం జరిగింది.
వివాహం అనంతరం కూకట్‌పల్లి శాంతినగర్లో అపార్ట్ మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు నికిత కుటుంబ సభ్యులు డౌన్ పేమేంట్ చెల్లించారు. భార్య నికిత తన జీతం డబ్బుల నుంచి ఇంటి లోన్ కు సంబంధించిన ఈఎంఐలు చెల్లిస్తు వస్తుంది.
వివాహం అనంతరం కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న నికిత, శ్రావణల మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటు వచ్చాయి. దీంతో పెద్దల సమక్షంలో రాజి కుదుర్చారు.అదే సమయంలో గర్భం దాల్చిన నికిత రెండు ఏళ్ల క్రితం ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది.
ఇదిలా ఉండగా శుక్రవారం నికిత తన కుటుంబ సభ్యులతో కలిసి శాంతినగర్ లోని అర్రవల్లిస్ ఆర్ఆర్ హోమ్స్ వద్దకు చేరుకోగా తమ ఇంట్లో వేరే వాళ్లు ఉండటాన్ని గమనించిన నికిత ఎవరు అని ప్రశ్నించగా తాము ఇంటిని కొనుగోలు చేశామని సమాధానం ఇచ్చారు.
తన ఇంటిని తనకు తెలియకుండా తన భర్త శ్రావణ్ విక్రయించినట్టు గుర్తించిన నికిత, నికిత కుటుంబ సభ్యులు శ్రావణ్‌కు కాల్ చేయగా శ్రావణ్ సమాధానం ఇవ్వకపోవడంతో నికిత కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తన భర్తతో గొడవ జరిగిన సమయంలో పెద్ద మనుషులుగా వచ్చిన వారే తమ ఇంటిని కొనుగోలు చేశారని, ఇంటి పత్రాలు అడిగితే ఇవ్వడం లేదని నికిత ఆరోపించింది.
తన ఇంటిని తనకు ఇప్పించాలని నికిత తన కుటుంబ సభ్యులు, తన కూతురుతో కలిసి ఇంటి ముందు బైఠాయించింది. నికిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.