
అదుపుతప్పి ఆటో బోల్తా… నలుగురికి తీవ్ర గాయాలు..
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. మరిపెడ మండల కేంద్రంలో ఆటో బోల్తా కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్ దగ్గర ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడ్డ నలుగురు మరిపెడ మండలం బావోజిగూడెం గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.