కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 30 పశువులు గల్లంతు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
నవంబర్ 01,
బూర్గంపాడు మండల పరిధిలో ఉన్న కృష్ణ సాగర్ గ్రామ పంచాయతీలో గల ఊర్ల దోసపాడు గ్రామంలో గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గ్రామంలో కట్టేసి ఉన్న పశువులు సుమారు ఒక 30 వరద బీభత్సానికి కొట్టుకుపోయినట్టు సమాచారం పక్కనే ప్రవహిస్తున్న పాలవాగు వరద పొంగిపొరడం తో పక్కనే కట్టేసి ఉన్న ఉర్లపాడు గ్రామానికి చెందిన రైతుల పశువులు చనిపోయాయని గ్రామస్తులు తెలిపారు.
ఆ గ్రామంలోని గుండె సన్నయ్య కు సంబంధించిన 11 పశువులు.. రవ్వ జోగాయ్యకి సంబంధించిన 6 పశువులు.. సురేష్..3 కోటేశ్వరావు..2..కోశయ్య 4 ముసుకి నందయ్య ఆరు.. దేవయ్య 4 మంగమ్మ 2 వలస గిరిజన రైతులకు సంబంధించిన పశువులు చనిపోయాయని
బూర్గంపహాడ్ తాహసిల్దార్ మహమ్మద్ ముజాహిద్ మరియు మండల ప్రజా పరిషత్ అధికారి జమలారెడ్డి వీరితోపాటు కిందిస్థాయి సిబ్బంది. ఎంతమంది పశువుల యజమానులు నష్టపోయారు ఎంత నష్టపోయారు అనే దానిపై విచారణ చేసి పై అధికారులకు తెలియజేయుటకై వారి దగ్గరికి వెళ్తున్నట్టు సమాచారం.