లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చండి…
వారికి సహాయ చర్యలు అందించండి… మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పు పరిస్థితులపై ఈరోజు ఉదయం నుంచి జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమీక్షిస్తున్న రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ , సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలో నెలకొన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మారం చేయాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి.
రెస్క్యూటీమ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైతే రక్షణ చర్యలకు హెలికాప్టర్లు వినియోగించాలని ఆదేశించారు.
విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు సిబ్బంది 24 గంటల పాటు సచివాలయంలో అందుబాటులో ఉండాలి.
విద్యుత్, తాగునీటికి, రాకపోకలకు అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నెలకొన్న పరిస్థితులపై ఆ జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.
తక్షణమే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎలాంటి ప్రాణా నష్ట ఆస్తి నష్టం చేరకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని సూచన
మంత్రి పొంగులేటి ఆదేశాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా వాసులను రక్షించేందుకు రాక
ఎమ్మార్వో పీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సహాయక చర్యలు
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్
అవసరమైతే హెలికాప్టర్ ను రంగంలోకి దించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితుల పై ఆరా తీస్తున్న పొంగులేటి
ప్రజలకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన