పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద కాలువకు గండి పాలేరు రిజర్వాయర్ వద్ద గల విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్ట్ కట్టకు గండి పడింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లో భారీఎత్తున వరద ప్రవాహం పెరిగింది. ఆ వరద ఉధృతికి హైడల్ కట్టకు గండిపడింది. ఈ వరద సాగర్ ఎడమకాల్వలోకి చేరుతుండటంతో ఆ కాల్వ కట్టకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హైడల్ ప్రాజెక్టు చుట్టు ప్రహరీ సైతం వరదలో …

పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద కాలువకు గండి

పాలేరు రిజర్వాయర్ వద్ద గల విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్ట్ కట్టకు గండి పడింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లో భారీఎత్తున వరద ప్రవాహం పెరిగింది.

ఆ వరద ఉధృతికి హైడల్ కట్టకు గండిపడింది. ఈ వరద సాగర్ ఎడమకాల్వలోకి చేరుతుండటంతో ఆ కాల్వ కట్టకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హైడల్ ప్రాజెక్టు చుట్టు ప్రహరీ సైతం వరదలో కొట్టుకుపోయింది.

Updated On 1 Sept 2024 6:33 PM IST
cknews1122

cknews1122

Next Story