ఖమ్మం జిల్లాలో పొంగిన పాలేరు.. రాకపోకలు బంద్! బ్లాక్ అయినా సూర్యాపేట to ఖమ్మం హైవే.. హైవేపై పారుతున్న వరద నీరు.. భారీ ట్రాఫిక్ జామ్ సికె న్యూస్ ప్రతినిధి పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ముంచేత్తిన వరద నీరు బందంపల్లి విలేజ్ నీట మునగడంతో స్థానిక ఫంక్షన్ హాల్లో ప్రజలను తరలించిన అధికారులు కాకరవాయి మద్దుల చెరువుకు వరదనీరు పోటీ ఎత్తడంతో సహాయక చర్యలను ప్రారంభించారు అదేవిధంగా పాలేరు చెరువు నాలుగు పారడంతో గొరిల్లా పాడు తండా …

ఖమ్మం జిల్లాలో పొంగిన పాలేరు.. రాకపోకలు బంద్!

బ్లాక్ అయినా సూర్యాపేట to ఖమ్మం హైవే..

హైవేపై పారుతున్న వరద నీరు..

భారీ ట్రాఫిక్ జామ్

సికె న్యూస్ ప్రతినిధి

పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ముంచేత్తిన వరద నీరు బందంపల్లి విలేజ్ నీట మునగడంతో స్థానిక ఫంక్షన్ హాల్లో ప్రజలను తరలించిన అధికారులు కాకరవాయి మద్దుల చెరువుకు వరదనీరు పోటీ ఎత్తడంతో సహాయక చర్యలను ప్రారంభించారు

అదేవిధంగా పాలేరు చెరువు నాలుగు పారడంతో గొరిల్లా పాడు తండా తుమ్మల తండా ఇంకో రెండు అడుగులతో నీరు వరద ఉధృతి పెరిగితే తుమ్మలతండకు చుట్టుముట్టే అవకాశం ఉంది వీటిపైన అధికారులు త్వరగా తయారు త్వరగా సహాయక చర్యలు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వలన గ్రామాలు జలమయం అయ్యాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని సుర్దేపల్లి- సూర్యాపేట జిల్లా, పాలారాం గ్రామాల మధ్య ఉన్న పాలేరు పొంగి పొర్లుతుంది. చప్టా పై నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు.

ఎంపీడీఓ యం.యర్రయ్య, తహశీల్దార్ ఇమ్రాన్, ఇరిగేషన్ డీఈఈ మన్మధరావు లు ఘటనా స్థలం కు చేరుకుని రహదారిని దగ్గర ఉండి బంద్ చేయించారు. రహధారి కి అడ్డంగా వళ్ల కంచె ఏర్పాటు చేశారు.

అదే విధంగా సుర్దేపల్లి- కిష్టాపురం, బుద్దారం-రాయగూడెం, నాచేపల్లి గ్రామాల మధ్య ఉన్న రహధారుల ను మండల అధికారులు పర్యవేక్షించారు. బుద్దారం వాగు చపా వద్ద తాటి మొద్దులు అడ్డు పడి నీరు భారీగా నిలవటంతో సానిక పంచాయతీ కార్యదర్శి జెసీబీ వాటిని తొలిగించారు. దీంతో వరద ఉదృతి తగ్గింది. రాయగూడెం-బుద్ధారం గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు.

చెరువుమాధారం చెరువు నుంచి ఏపీ కి 380 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ఏపీలో వరదల ఉదృతం ఎక్కువ కావటంతో అక్కడి అధికారుల సూచన మేరకు ఇరిగేషన్ డీఈఈ మన్మధరావు, ఏఈ నరేష్ లు 100 క్యూసెకుల నీటిని తగ్గించారు. ప్రస్తుతం చెరువు నీటి మట్టం 7.5 అడుగులకు చేరింది.

మండలంలో చెరువులు, కుంటలు జలమయంగా మారాయి. పంచాయతీలలో వీధులన్ని బురదమయంగా మారాయి. మొత్తం మీద మండల ప్రజలు అతలాకుతమయ్యారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమతం చేస్తున్నారు.

Updated On 1 Sept 2024 10:23 AM IST
cknews1122

cknews1122

Next Story