ఖమ్మం కు బయలుదేరనున్న సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్రెడ్డి మరికాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరనున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
భారీ వర్షాలతో ఆ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. నిన్న మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి.భారీ వర్షాల తో వాటిల్లిన నష్టం.. వరద సహాయక చర్యల పరిస్థితి పై సమీక్ష.హాజరైన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు
వర్షాలు, వరద సాయంపై సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి
భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలి..
కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి..
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి..
భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని 8
పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలి.
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం.
ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలి…
వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలి…
వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలి…
తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ ..
జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు లేఖ..
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ …
ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు ..