మధురానగర్‌ పీఎస్‌లో డీసీపీపై తిరగబడ్డ కానిస్టేబుల్‌ తనను తిట్టాడనే ఆగ్రహంతో పై అధికారి అని కూడా చూడకుండా ఏకంగా డీపీసీపైనే తిరగబడ్డాడు ఓ కానిస్టేబుల్‌. ఆరేయ్‌ నువ్వే యూజ్‌లెస్‌ ఫెల్లోరా అంటూ కోపంతో ఊగిపోయాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ రోల్‌కాల్ ఉదయం 10.30 గంటలకు ఉంటుందని స్టేషన్ సిబ్బందికి ఉదయం 9.19 నిమిషాలకు మేసేజ్ పంపించారు. ఈ రోల్‌కాల్‌కు పోలీస్ …

మధురానగర్‌ పీఎస్‌లో డీసీపీపై తిరగబడ్డ కానిస్టేబుల్‌

తనను తిట్టాడనే ఆగ్రహంతో పై అధికారి అని కూడా చూడకుండా ఏకంగా డీపీసీపైనే తిరగబడ్డాడు ఓ కానిస్టేబుల్‌. ఆరేయ్‌ నువ్వే యూజ్‌లెస్‌ ఫెల్లోరా అంటూ కోపంతో ఊగిపోయాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ రోల్‌కాల్ ఉదయం 10.30 గంటలకు ఉంటుందని స్టేషన్ సిబ్బందికి ఉదయం 9.19 నిమిషాలకు మేసేజ్ పంపించారు. ఈ రోల్‌కాల్‌కు పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ డి.తిరుపాల్ నాయక్ ఆలస్యంగా వచ్చాడు.

దీంతో డీసీపీ విజయ్‌కుమార్ 'యూజ్ లెస్ ఫెలో.. డ్యూటీ ఇలాగేనా చేసేది.. పోలీస్ డ్యూటీ అనుకున్నావా.. గొడ్లు కాసే పని అనుకున్నావా.. ఇంతసేపు ఎక్కడికి పోయావు.. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నావుగా.. డ్యూటీ సరిగా చేయవా?’ అంటూ తిరుపాల్ నాయక్‌ను తిట్టాడు.

తనను తిట్టడంతో ఆగ్రహించిన తిరుపాల్ నాయక్ ‘అరేయ్ నువ్వే యూజ్ లెస్ ఫెలోరా.. ఎన్ని మాటలు అంటావురా నన్ను.. బయట పనిచేస్తే ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుందిరా.. నా భార్యకు డెలివరీ అయితే ఉండాల్సి వచ్చిందిరా.. నా భార్యను నేను కాకుంటే ఎవరు చూసుకుంటార్రా.. ఇచ్చే జీతం కంటే పనెక్కువ చేయించుకుంటున్నావురా’ అని అంటూ డీసీపీ విజయ్‌కుమార్‌పై తిరగబడ్డాడు.

డీసీపీపై తిరగబడ్డ కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా, మధురా నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని వ్యభిచార గృహాల నుంచి పోలీసుల వసూళ్లపై ఆరా తీసేందుకు డీసీపీ రోల్‌కాల్ పెట్టినట్లు సమాచారం.

Updated On 2 Sept 2024 11:09 AM IST
cknews1122

cknews1122

Next Story