వార్డు మెన్ గా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని
మంత్రి ఉత్తమ్ కు వినతి పత్రాన్ని అందించిన
వాచ్ మెన్ యేసుమళ్ల రాములు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 03
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలలో పనిచేస్తున్న 150 మంది పార్ట్ టైమ్ వాచ్ మెన్ లు (2016 నుంచి 2018 వరకు ఔట్ సోర్సింగ్ లో, 2018 నుంచి ప్రస్తుతం పార్ట్ టైమ్ గా) పని చేస్తున్న.
మమ్మల్ని తిరిగి ఔట్ సోర్సింగ్ పద్దతిలోకి మార్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం మా చెరువు కట్ట సందర్శనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాచ్ మెన్ రాములు చెరువు దగ్గరకు వచ్చి మరి వినతి పత్రాన్ని అందజేశారు.
వెంటనే స్పందించిన మంత్రి సెక్రటరీ కి ఫోన్ చేసి మాట్లాడారనీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయ సంస్థలలో గత 7 సం. రాలుగా 150 మంది వాచ్ మెన్ లు పనిచేస్తున్నమనీ ఒక్కొక్క సంస్థలో ఇద్దరు చొప్పున వాచ్ మెన్ ల నియామకం చేపట్టడం జరిగిందనీ 2016 సం.రంలో ఏర్పాటు చేసిన 103 గురుకుల విద్యా సంస్థలలో ఇద్దరు చొప్పున ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేపట్టిన్నారు. కాని ఆ తర్వాత మాలో కొందరిని ఔట్ సోర్సింగ్ నుండి పార్ట్ టైమ్ ఉద్యోగులుగా మార్చినారు.
పార్ట్ టైమ్ ఉద్యోగులుగా మర్చడం వలన మేము ఉద్యోగ భద్రత కొల్పోయాము, నెలనెల జీతం కూడ సరైన సమయానికి ఇవ్వకపోవడం వలన ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నాము. తెలంగాణ ప్రభుత్వం అందరికి ఇచ్చిన విధంగా 30 శాతం పీ అర్ సి కూడ మాకు ఇప్పటి వరకు వర్తింప చేయలేదనీ.
మేము ఈ వాచ్ మెన్ ఉద్యోగమే పరమావదిగా బావించి సక్రమంగా మా విధులు నిర్వహిస్తు స్కూల్ యాజమన్యాలు ప్రభుత్వం యొక్క ఆదేశాలను తు.చ.తప్పకుండ పాటిస్తూ ఉన్నామనీ దాదపు 150 మంది ఉద్యోగులకు ఈ ఉద్యోగమే జీవన ఆధారం అని మా యొక్క వినతికి స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మా యూనియన్ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.