భారీవర్షాలవల్ల జరిగిన నష్టాన్ని, పరిశీలించిన మంత్రి ఉత్తమ్ పంట నష్టం జరిగిన ప్రతి రైతన్నకి, ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి 10 వేలు హుజూర్ నగర్ ట్యాంక్ బండ్ ని తప్పుడు ప్రణాళిక తో నిర్మించి వరదలకు కారణమైన అధికారి ఎఈ శ్రీనివాస్ సస్పెండ్ హుజూర్ నగర్ మున్సిపాల్టీ , బూరుగడ్డ చెరువు ని పరిశీలించి ప్రజలకు భరోసానిచ్చిన రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సికె …

భారీవర్షాలవల్ల జరిగిన నష్టాన్ని, పరిశీలించిన మంత్రి ఉత్తమ్

పంట నష్టం జరిగిన ప్రతి రైతన్నకి,

ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి 10 వేలు

హుజూర్ నగర్ ట్యాంక్ బండ్ ని తప్పుడు ప్రణాళిక తో నిర్మించి వరదలకు కారణమైన

అధికారి ఎఈ శ్రీనివాస్ సస్పెండ్

హుజూర్ నగర్ మున్సిపాల్టీ , బూరుగడ్డ చెరువు ని పరిశీలించి ప్రజలకు భరోసానిచ్చిన

రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 03

ప్రజల కష్టాలను క్షేత్ర స్థాయి లో పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు పర్యటన చేస్తునట్టు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

మంగళవారం వారం హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలోని 1వ వార్డు లో పర్యటించి ఇండ్లలోకి నీరు పోయి నష్టం వాటింలిన ప్రతి ఒక్కరికి 10 వేలు ప్రభుత్వం ఇస్తుందని,దద్దనాల చెరువు వరద వల్ల ధ్వంసం అయినా డ్రైనేజి ని పరిశీలించి త్వరగా మరమ్మత్తులు చేపించాలని అధికారులకు సూచించారు.

శివాలయం బజారు 7వ వార్డు లో ఉన్న ట్యాంక్ బండ్ కొరకు కట్టిన డ్రైనేజి ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం వల్లనే వరద నీరు ఇండ్లలోకి వచ్చాయని నేను గతంలో ఎంపిగా ఉన్నపుడే ప్లానింగ్ సరిగ్గా లేదని మార్చాలని సూచించిన మార్చకుండా అలాగే నిర్మించటం తో నేడు ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని దీనికి కారణమైన ఏ ఈ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయాలని, అలాగే చెరువు కట్టకు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇరిగేషన్ సి ఈ రమేష్ బాబు ను ఆదేచించారు.

అలాగే వరద వల్ల ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం లో తడిచిన ఎరువుల బస్తాలను పరిశీలించారు. అనంతరం మట్టంపల్లి రోడ్డు జంక్షన్ లో దెబ్బ తిన్న రోడ్లను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని ఆర్ డి ఓ కి సూచించారు. అలాగే రోడ్లను నూతనంగా నిర్మించాలని పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీర్ కి సూచించారు.

అంతకుముందు బూరుగడ్డ నుండి గోపాలపురం రోడ్డు లో బూరుగడ్డ చెరువు తెగిన ప్రదేశాన్ని పరిశీలించి త్వరగా మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే నష్టపోయిన ప్రతి ఎకరానికి 10 వేల రూపాయలు ప్రభుత్వం నుండి సహాయం అందిస్తానని రైతులకి మంత్రి భరోసా ని ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ శ్రీనివాసులు,తహసీల్దార్ నాగేందర్ ,మున్సిపల్ కమిషనర్ యాకుబ్,మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి,ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated On 4 Sept 2024 11:11 AM IST
cknews1122

cknews1122

Next Story