
గంజాయి పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితులు…
పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి
పెబ్బేరు అక్టోబర్06 (సి కే న్యూస్)
హైదరాబాదు నుండి బెంగళూరుకు వెళుతున్న ఓ
ప్రైవేటు బస్సులో
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పెబ్బేరు పోలీసులు పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి సోమవారం పోలీస్ సిబ్బందితో వద్ద ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. పెబ్బేరు బస్టాండులో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని దగ్గర ఉన్న బ్యాగులో 2లక్షల విలువైన 4కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన మల్లేష్(25) అతని స్నేహితులైన దిలీప్ కాళీ ఇద్దరు కలిసి మోహన్ మరియు అర్జున అనే వ్యక్తుల దగ్గర ఒరిస్సాలో గంజాయిని కొని వారు బెంగుళూరు తీసుకెళ్లి కస్టమర్లకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నామని పోలీసుల విచారణలో తెలిపారు. దిలీప్ అనే వ్యక్తి మధ్యలోనే దిగి పని ఉందని వెళ్ళినట్టు తెలిపారు. పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు