జిట్టా బాలకృష్ణ అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత..
జిట్టా బాలకృష్ణ అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత.. మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన అభిమానులు భువనగిరిలో ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. భువనగిరి పట్టణానికి చేరుకున్న ఆయన మృతదేహానికి పట్టణంలోని చెరువుకట్ట వద్ద అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున అమరవీరుల స్తూపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి …

జిట్టా బాలకృష్ణ అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత..
మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన అభిమానులు భువనగిరిలో ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
భువనగిరి పట్టణానికి చేరుకున్న ఆయన మృతదేహానికి పట్టణంలోని చెరువుకట్ట వద్ద అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున అమరవీరుల స్తూపం వద్దకు తీసుకొచ్చారు.
అక్కడికి వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్, సీనియర్ నాయకుడు తంగెళ్లపల్లి రవికుమార్‌లను జిట్టా బాలకృష్ణ అభిమానులు అడ్డుకుని నిరసన తెలిపారు. అనంతరం కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిట్టా మృతదేహానికి నివాళ్లు అర్పించారు.
