గుడుంబా రవాణా చేసే ముఠా అరెస్ట్
256లీటర్ల గుడుంబా పట్టివేత
102400 విలువ చేసే గుడుంబా
చత్తీస్గడ్ నుంచి రవాణా
సి కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలం,కృష్ణాపురం గ్రామ శివారులలో పోలీసులు వారు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు మగ వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై చత్తీస్గడ్ నుండి కృష్ణాపురం గ్రామం వైపు వస్తూ పోలీస్ పార్టీని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అనుమానంతో అప్రమత్తమై వారిని పోలీస్ వారు వెంబడించి పట్టుకున్నారు.
వారి దగ్గర నుండి 16 ప్లాస్టిక్ సంచులు నుండి ప్రభుత్వ నిషేధించిన నాటు సారాయి వాసన వస్తుండగా తనిఖీ చేయగా నాటుసారా సుమారు 256లీటర్లు ఛత్తీస్గఢ్ నుండి కొనుగోలు చేసి దానిని తెలుపు రంగు గల ప్లాస్టిక్ సంచులు పోసుకొని వస్తుండగా దానిని పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారు రూపాయలు .102400/- గా పోలీసులు అంచనా వేశారు.
వారిని విచారించగా వారి పేర్లు *మడప వినయ్ , కృష్ణాపురం గ్రామం, ఇతని దగ్గర 10 ప్లాస్టిక్ కవర్ లో సుమారుగా 160 లీటర్స్,మరో వ్యక్తి యలం కోటేష్ చెరుకూరు గ్రామం ఇతని దగ్గర 6 ప్లాస్టిక్ కవర్స్ లో 96లీటర్స్ దొరికాయి అని మొత్తం 256 లీటర్లు వాటి విలువ 102400 రూపాయలు ఉంటుందని తెలియజేయడం జరిగింది.
మరియు వీరి దగ్గర నుండి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై గుర్రం.కృష్ణ ప్రసాద్,సివిల్ మరియు సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొనడం జరిగింది.