మానవత్వం చాటుకున్న లలిత జువెలర్స్ యజమాని హైదరాబాద్ :సెప్టెంబర్ 10తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం రేలిఫ్ …

మానవత్వం చాటుకున్న లలిత జువెలర్స్ యజమాని

హైదరాబాద్ :సెప్టెంబర్ 10
తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు.

మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కు అందజేశారు.

ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం రేలిఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ఇచ్చాను. ఈరోజు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ఇచ్చాను. రెండు తెలుగు రాష్ట్రాలో వరదల వల్ల పెద్ద నష్టం జరిగింది.

నేను ఇచ్చింది పెద్ద సహాయం కాదు. వరదల వల్ల నష్టపోయిన వారికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వా లు చాలా చేస్తు న్నాయి. అందుకే నా వంతు సాయం చేశాను. ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలి. వ్యాపా రులు సైతం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.

వరద బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు.

మైత్రా ఎనర్జీ గ్రూప్ మేనే జింగ్ డైరెక్టర్ విక్రం కైలాస్, అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవి కైలాస్‌లు కోటి రూపాయల విరాళం అందించారు.

ప్రముఖ నిర్మాత, నటి యార్లగడ్డ సుప్రియ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఆ మేరకు విరాళం చెక్కును అందజేశారు…

Updated On 10 Sept 2024 7:50 PM IST
cknews1122

cknews1122

Next Story