ప్రభుత్వం కొత్త స్కీమ్..
త్వరలో ఇంటింటికీ ఉచిత ఇంటర్నెట్!
TG: సిటీలతో పాటు గ్రామాల్లో ఇంటింటికీ హైస్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
33 జిల్లాలను 10 జోన్లుగా విభజించి టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థల ద్వారా ఇంటర్నెట్ను అందించనుంది. దీని కోసం ఇప్పటికే ఆయా సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది.
తొలుత 3 నెలలు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను ఫ్రీగా అందించి, ఆ తర్వాత తక్కువ ధరకు ఈ సేవల్ని ప్రొవైడ్ చేయనుంది.
ఇంటింటికీ ఇంటర్‌నెట్, కేబుల్ టీవీ కనెక్షన్లు ఇస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ మొదలైంది. ‘టీ-ఫైబర్’ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలని ప్రభుత్వం భావించింది.
సర్కారు ఎంపిక చేసిన గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ సేవలను అందించేందుకు ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయనున్నది. టెండర్ ద్వారా ఖరారు చేసిన తర్వాత తొలి మూడు నెలల పాటు ఆ గ్రామాల్లో ఉచితంగానే అందజేయాలని భావిస్తున్నది.
ప్రతి ఇంటికీ కనీసంగా 20 ఎంబీ (మెగా బైట్స్) స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ను ఓఎఫ్‌సీ (ఆప్టికల్ ఫైబర్ కేబుల్) ద్వారా అందించాలని అనుకుంటున్నది. దీనితో పాటే ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే సౌకర్యం, ‘ఫ్రీ టు ఎయిర్’ పేరుతో ఉచితంగా అందుతున్న టీవీ చానెళ్లతో పాటు కొన్ని ‘పెయిడ్’ చానెళ్లను కూడా ఇవ్వాలనుకుంటున్నది.