అధైర్య పడకండి మేమున్నాము
సింగరేణి బాధితులకు న్యాయం జరగకపోతే సింగరేణి యాజమాన్యం తో పోరాటానికి ఐనా సిద్ధం
… ఎమ్యేల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయ్ కుమార్.
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
మండల పరిధిలోని కిష్టారం గ్రామ కాలనిల్లో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల తీవ్రంగా పగిలిపోయిన ఇల్లు కారణం గా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న కిష్టారం ప్రజలకు వర్షా ప్రభావం వల్ల ఇల్లు పై కప్పు లు, ఇంటి గోడలు కూలిపోవటం తో కిష్టారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పునరావస కేంద్రం ప్రభుత్వం ఏర్పాట్లు చెయ్యటం తో ఎమ్మెల్యే మట్టా రాగమయి, డాక్టర్ మట్ట దయానంద్ కిష్టారం నిరాశ్రయులను కలుసుకొని పరామర్శించినారు.
ఈ తరుణంలో స్థానిక సింగరేణి బాధితులు ఎమ్మెల్యేతో గత బి ఆర్ఎస్ ప్రభుత్వ మాయ మాటలు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే మోసపూరిత హామీలు వల్ల ఈరోజు కిష్టారం గ్రామ కాలనీ లో కష్టాలు పాలై ఉండటానికి నిలువు నీడ కూడా లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఈ ఇల్లు సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు కూలి ఎన్ని ప్రాణాలు పోతాయో అని బయపడుతున్నాము అని కన్నీటి తో మొరపెట్టుకున్నారు . ఏళ్ల తరబడి ప్రభుత్వాలు, సింగరేణి ఆఫీస్ లు చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదు అని ముకుమ్మడిగా వారి ఆవేదన తెలియజేసారు..
ప్రజలతో డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ కిష్టారం ప్రజలు బాధలు మా ఇంటి బాధగా భావించి మీ కష్టాల్లో తోడుగా ఉంటాము అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఐనా రోజు నుండి ఈరోజు వరకు సింగరేణి యాజమాన్యం తో అధికారులు తో మీ ఇబ్బందులు, హామీలు గురించి మాట్లాడుతున్నాము అని తెలిపారు, ఇదే ఇంకా ఆఖరి అవకాశం ఇస్తున్నాము 2 నెలల్లో సింగరేణి యాజమాన్యం సింగరేణి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యకపోతే అందరి కంటే ముందు మీతో కలిసి పోరాటానికి వస్తాము అని కిష్టారం ప్రజలకు హామీ ఇచ్చారు.ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కి, జిల్లా మంత్రివర్యులు లు, సింగరేణి సీఎండీ కి,ఖమ్మం జిల్లా కలెక్టర్ కి సింగరేణి యాజమాన్యం కు తెలియజేసి బాధితులకు న్యాయం చెయ్యటానికి కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో సింగరేణి జి ఎమ్ , సింగరేణి పి ఓ ఆర్డిఓ , ఎమ్మార్వో, , , మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ , సింగరేణి ఉద్యోగులు మరియు కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.