HyderabadPoliticalTelangana

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ మీద దాడి జరిగింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మానసిక పరిస్థితి బాగాలేని ప్రకాష్(60) అనే వ్యక్తి, ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ జూనియర్ వైద్యురాలిపై దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు.

అతన్ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా సదరు వ్యక్తి మూరచవ్యాధి ఉన్నట్టు, దాడి చేసిన సమయంలో మద్యం కూడా సేవించి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు.

దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి: జూడాలు

గాంధీ ఆసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో మద్యం మత్తులో ఉన్న రోగి మహిళా డాక్టర్ పై దాడి చేయడం దుర్మార్గం అన్నారు. గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఈ ఘటనపై ఫిర్యాదు చేశామని చెప్పారు.

దీనిపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button