హన్మకొండ డాల్పిన్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం : చిన్నారి మృతి !
తమకు న్యాయం కావాలంటూ తల్లిదండ్రుల ఆందోళన
హన్మకొండ లోని డాల్పిన్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 8 సంవత్సరాల సాయి శ్రీ, ఈరోజు ఉదయం మృతి చెందినట్టు తెలిసింది..
హన్మకొండ లోని డాల్పిన్ హాస్పిటల్ నందు ఈ నెల తొమ్మిదవ తేదీన జ్వరం వచ్చిందని అడ్మిట్ చేశారు తల్లిదండ్రులు.అయితే.. 8 సంవత్సరాల పాప సాయి శ్రీకి డెంగ్యూ ఫీవర్ అని చెప్పి ట్రీట్మెంట్ చేశారు వైద్యులు.
దీంతో ఒక రోజు ముందు పాప ఆరోగ్యం నిలకడగానే ఉంది ఎలాంటి భయం లేదు అని వైద్యులు హామీ ఇచ్చారు.
దీంతో ఈరోజు ఉదయం తల్లిదండ్రులు వెళ్లి పాపను చూస్తే చనిపోయి ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. డాక్టర్లు పట్టించుకోలేదని అందు వల్లనే తమ పాప చనిపో యిందని హాస్పిటల్ ఎదుట పాప తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ఎదుట పాప తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు…..