టీచర్లకు కొత్త తలనొప్పులు సర్దుబాటు పేరుతో అనుభవం లేని బాధ్యతలు అప్పగించే యత్నం మానసికంగా నలిగిపోతున్న టీచర్లు సంబంధం లేని సబ్జెక్టును బోధించాలంటూ తీవ్ర ఒత్తిళ్లు చేతులు దులుపుకున్న అధికార గణం తెలుగు ఉపాధ్యాయుడికి సీబీఎస్ఈ సిలబస్ ఆంగ్ల మాధ్యమం బోధన అప్పగింత ప్రభుత్వం పునరాలోచించాలంటున్న ఉపాధ్యాయులు విద్యా బోధనే లక్ష్యంగా, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. వారికి తాజాగా కొత్త చిక్కు వచ్చి పడింది. అది కాస్త …

టీచర్లకు కొత్త తలనొప్పులు

సర్దుబాటు పేరుతో అనుభవం లేని బాధ్యతలు అప్పగించే యత్నం

మానసికంగా నలిగిపోతున్న టీచర్లు

సంబంధం లేని సబ్జెక్టును బోధించాలంటూ తీవ్ర ఒత్తిళ్లు

చేతులు దులుపుకున్న అధికార గణం

తెలుగు ఉపాధ్యాయుడికి సీబీఎస్ఈ సిలబస్ ఆంగ్ల మాధ్యమం బోధన అప్పగింత

ప్రభుత్వం పునరాలోచించాలంటున్న ఉపాధ్యాయులు విద్యా బోధనే లక్ష్యంగా, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.

వారికి తాజాగా కొత్త చిక్కు వచ్చి పడింది. అది కాస్త వారి మెడకు గుదిబండగా మారే పరిస్థితి ఏర్పడింది. తద్వారా వారు మానసిక ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైతే వివిధ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారో వారిని ఇతర ప్రాంతాల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఆ స్థానాలకు సర్దుబాటు చేయాలన్నది ప్రభుత్వ ఆదేశం.

కింది స్థాయిలోని విద్యాశాఖ అధికారులు ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు
తెలుగు సహాయకుడిగా పనిచేస్తున్నారు. పని సర్దుబాటులో భాగంగా మరొక ఉన్నత పాఠశాలలోని ఆంగ్ల మాధ్యమంలో సాంఘిక శాస్త్రం బోధించాల్సిందిగా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

సీబీఎస్ఈ సిలబస్ లో సాంఘిక శాస్త్రం బోధనా బాధ్యతలు అప్పగించారు. తాను తెలుగు పండితుడినని, ఆ సబ్జెక్టు బోధించడానికి తనకు ఎలాంటి అవగాహన లేదని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది.

మండల, జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారుల కు ఆయన మొరపెట్టుకున్నా, కాళ్ళ, వేళ్ళ, పడ్డ కనికరం చూపలేదు. పైగా బలవంతంగా రిలీవ్ చేసి పంపారు. బదిలీ చేసిన పాఠశాలకు వెళ్లిన ఆ ఉపాధ్యాయుడు అక్కడ విద్యార్థులకు సాంఘిక శాస్త్రం బోధించలేను చెప్పడంతో ఆందోళన చెందడం విద్యార్థుల వంతయింది.

ఇలా సుమారు 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు ఇలాంటి మానసిక వేదనకు గురవుతున్నారు. మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు తమ ఆవేదన చెప్పుకున్నప్పటికీ వారి రోధన అరణ్యరోధనే అయింది. విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని సరికొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడం పట్ల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

సంబంధంలేని విద్యా బోధనను చేయాల అనడం ఏ మేరకు శాస్త్రీయతో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. ఇలాంటి చర్య విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపి అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులుగా ఉపాధ్యాయుల, ఇటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సి ఉంటుంది.

కానీ అందుకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. గతంలో ఒక తెలుగు ఉపాధ్యాయుడు గణితం బోధిస్తుండగా చూసిన ఒక ఐఏఎస్ అధికారి ఇది మంచి సంప్రదాయం కాదు, ఇది తప్పు ఆయనను అవహేళన చేశారు. కానీ ఇప్పుడు మా అధికారులు దాన్నే పునరావృతం చేస్తుండటాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఒక డాక్టర్ ఇంజనీరింగ్ పనులు చేయడం ఎంత అసాధ్యమో, సంబంధంలేని సబ్జెక్టులను బోధించాలని ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం అంతే అసాధ్యం అవుతుంది.

వ్యవహారాన్ని అవగాహన చేసుకోలేని పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు ఉన్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Updated On 12 Sept 2024 11:38 AM IST
cknews1122

cknews1122

Next Story