సీఎం ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా బ్యాగ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్య మంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆదివారం ఓ బ్యాగ్ కలకలం రేపింది. అప్రమత్త మైన సీఎం చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులుబ్యాగును స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు.
రేవంత్ రెడ్డి, ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా బ్యాగ్ కనపడడంతో దాన్ని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి ఇంటికి సమీపం నుంచి బ్యాగును మరో ప్రాంతానికి తరలించి తనిఖీలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో ఉన్నారు.
ఇవాళ టీపీసీసీ అధ్యక్షు డిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మహేశ్ కుమార్ గౌడ్‌కు రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.
ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో బ్యాగు కనపడడం అనుమానాలకు తావిస్తోంది…