ఫుల్లుగా తాగి గణేశుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ
వికారాబాద్ జిల్లాలో గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. ఫుల్లుగా మద్యం సేవించి ఓ ఎస్‌ఐ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ : ఫుల్లుగా మద్యం సేవించి ఓ ఎస్‌ఐ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనిలోని గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుండగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. స్థానికులతో వాగ్వాదానికి దిగి గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు.
హిందు ధర్మాన్ని, దేవుణ్ణి అవమానించిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.