యువ రైతును చితకబాదిన ఇద్దరు రౌడీషీటర్లు.. వణుకు పుట్టిస్తున్న దృశ్యాలు..!
అచ్చం ల్లో కనిపించే లాంటి రియల్ సీన్ ఇది.నడి రోడ్డుపై ఆటో పార్కింగ్ చేసుకుని మద్యం సేవిస్తున్న ఇద్దరు రౌడీషీటర్లు ఓ యువ రైతుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
కర్రలు, ఇనుప రాడ్లతో పశువును బాదినట్లు చితకకొడుతున్నా అక్కడున్న వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. ఆ దాడి దృశ్యాలు ఓరుగల్లు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి.
వరంగల్ లో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరిపోతు న్నాయి.. అమాయకుల పై వారి కండకవరాన్ని ప్రదర్శిస్తున్న రౌడీషీటర్లు ప్రశ్నించిన వారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు.
వరంగల్ నగరంలోని BR నగర్ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్, సమోసా సంపత్ అనే ఇద్దరు రౌడీ షీటర్లు నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. రోడ్డు పై ఆటో పెట్టుకొని ఆ ఇద్దరు రౌడీషీటర్లు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న యువరైతు సంపత్ పై విచక్షణా రహితంగా దాడిచేశారు.
రైతు సంతోష్ పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో ఆటోలో మద్యం సేవిస్తున్న రౌడీ షీటర్లు మల్లిఖార్జున్, సమోసా సంపత్ అతనిపై ఉమ్మి వేశారు.
ఇదేంటని అడిగి పాపానికి రెచ్చిపోయారు. కర్రలు, ఇనుప రాడ్లతో పశువును బాదినట్లు చితకకొట్టారు. అక్కడున్న వారంతా భయంతో ప్రేక్షక పాత్ర వహించారు. ఈ ఘటనలో తీవ్రంగా సంతోష్ తీవ్రంగా గాయపడ్డాడు.
రౌడీషీటర్లు వెళ్లిన తర్వాత స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతండటంతో ఓరుగల్లు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.