హైదరాబాద్‌ నగరంలో విషాదం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్సింగ్ చదువుతోన్న విద్యార్థిని విగతజీవిగా పడి ఉంది.అయితే, ఇద్దరు యువకులు ఆమెను దారుణంగా హతమార్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రులు తమ కూతురిపై అత్యాచారం …

హైదరాబాద్‌ నగరంలో విషాదం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య..

నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్సింగ్ చదువుతోన్న విద్యార్థిని విగతజీవిగా పడి ఉంది.
అయితే, ఇద్దరు యువకులు ఆమెను దారుణంగా హతమార్చినట్లుగా తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రులు తమ కూతురిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతంగా చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated On 16 Sept 2024 9:27 AM IST
cknews1122

cknews1122

Next Story